ఉండ్రాళ్ళ తద్దె

పౌర్ణమినాటికి చంద్రుడు పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర నక్షత్రానికి సమీపాన ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని భాద్రపదం అన్నారు పెద్దలు. ఈ నెలలో శుక్లపక్షం దేవతా పూజలకూ... కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకూ ఉత్కృష్టం అని పురాణప్రవచనం. 

ఈ నెలలో వినాయక చవితి కన్నా ముందు వచ్చే పర్వదినం వరాహజయంతి హిరణ్యాక్షుని చెర నుంచి భూమిని కాపాడేందుకు విష్ణువు శ్వేతవరాహ రూపుడై అవతరించిన దినమిది. ఈ రోజున వరాహమూర్తిని పూజిస్తే విశేషఫలం లభిస్తుందని నమ్మిక. వరాహస్వామి ఆలయం లేని చోట వైష్ణవాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

ఈరోజున చాలామంది మహిళలు సిరిసంపదలు కోరి 'పదహారు కుడుముల తద్దె' నోము నోచుకుంటారు. ఇక భాద్రపద శుద్ధ చవితి... అందరికీ తెలిసిన పర్వదినమే. విద్యల ఒజ్జ వినాయకుడు పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన దినం. ఈ చవితి ఆదివారం లేదా మంగళవారం వస్తే మరింత ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. గణపతి పూజ, ఉపాసనల్లాంటివి ఈరోజున మొదలు పెడితే విశేషఫలాలనిస్తాయని విశ్వాసం.

కామెంట్‌లు లేవు: